జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (13:35 IST)
పూరీ జగన్నాథుడు రథానికి సుఖోయ్ యుద్ధ విమానం చక్రాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని కోల్‌కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ అయిన ఇస్కాన్ వెల్లడించింది. గతంలో ఆలయంలోని స్వామి వారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించేవారు. కానీ, గత 15 యేళ్లుగా వాటిని కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారింది. గత యేడాది ఈ రథం టైర్లలో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఇస్కాన్ నిర్వాహకులు సుఖోయ్ 30 ఫైటర్ జెట్లకు ఉపయోగించే టైర్లను కొనగోలు చేయాలని నిర్ణయించారు. 
 
ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ వెల్లడించారు. తాము ఆ టైర్ల కోసం ఆర్డర్ చేయగా యుద్ధ విమానం టైర్లతో అవసరం ఏముందని సదరు కంపనీ కూడా ఆశ్చర్యపోయిందన్నారు. వారికి రథం సమస్యను వివరించడంతో పాటు ఆలయానికి ఆహ్వానించి ప్రత్యక్షంగా చూపించామని వెల్లడించారు. ఆ తర్వాతే వారు టైర్లు విక్రయించేందుకు సమ్మతించారని తెలిపారు. రథానికి మొత్తం నాలుగు టైర్లు అమర్చనున్నట్టు ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments