Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (13:10 IST)
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్, గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఆ ప్రకారంగా జూన్ ఒకటో తేదీన పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలను సవరించాయి. ఈ సవరించిన ధరల మేరకు పెట్రోల్, డీజల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం మార్పు చోటుచేసుకుంది.
 
19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.24 మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు నేటి అమల్లోకి రానున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగాఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. ఈ తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1723.50గాను ఉంటే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు సవసరించేలేదు. 
 
మరోవైపు, ఏప్రిల్ నెలలోరూ.41, మే నెలలో రూ.14.50 వరకు వీటి ధరలను తగ్గించిన విషయం తెల్సిందే. తాజా మరో రూ.24 మేరకు తగ్గించింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను కూడా ఆయిల్ కంపెనీలు మూడు శాతం మేరకు తగ్గించాయి. ఈ ధరల్లో కూడా ఒక నగరానికి మరో నగరానికి వ్యత్యాసం ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments