Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఐదో కరోనా టీకా.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఓకే

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (14:43 IST)
దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆ టీకాల‌ను ఇవ్వ‌వ‌చ్చు అని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. దీంతో భార‌త్ త‌న వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచేసింది. 
 
జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ఆమోదం ద‌క్క‌డంతో.. భార‌త్‌లో వినియోగించ‌నున్న ఐదో టీకా కానుంది. యురోపియ‌న్ యూనియ‌న్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మ‌న వ‌ద్ద ఉన్న‌ట్లు మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. 
 
జాన్స‌న్ సింగిల్ డోసు రాక‌తో.. కోవిడ్‌పై పోరాటం మ‌రింత బ‌లోప‌తం అవుతుంద‌ని మంత్రి చెప్పారు. దేశ‌వ్యాప్తంగా కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం ద‌క్కిన విష‌యం తెలిసిందే.
 
కాగా, వ్యాక్సిన్ అనుమతి కోసం కేంద్రంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ఇప్ప‌టికే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రకటించింది. అత్యవసర వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పింది. ఇప్ప‌టికే బయోలాజికల్‌-ఈ సంస్థ‌తో జాన్సన్‌ అండ్‌ జాన్సన్ ఒప్పందం చేసుకుంది.  

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments