Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఇంటి నుంచే ఆన్‌లైన్ పరీక్షలు.. జేఎన్టీయూ కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 6 మే 2021 (11:22 IST)
ఇంటి నుంచే ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న వేళ.. ఇక ఇంటి నుంచే ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ముందుగా ప్రయోగాత్మకంగా బీటెక్‌ 8వ సెమిస్టర్‌ విద్యార్థులకు నిర్వహించాలని భావిస్తున్నారు.
 
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, అనేక పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
 
గతేడాది విద్యార్థులకు సమీపంలోని కాలేజీల్లో పరీక్షలు రాసుకొనే వెసులుబాటును కల్పించారు. ఇలా పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశమిచ్చి, సెమిస్టర్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు.
 
ఈసారి కరోనా ఉధృతి గతేడాది కంటే తీవ్రంగా ఉండటంతో పరీక్షాకేంద్రాల్లో నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదనే నిర్ణయానికి వచ్చారు. బీటెక్‌ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్‌ పరీక్షలు కావడం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, జూన్‌, జూలై మాసాల్లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. 
 
ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని.. పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ మంజూరు హస్సేన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments