Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంసీఏ ఇక మూడేళ్లు కాదు.. రెండేళ్లకే కుదించారు..

Advertiesment
ఎంసీఏ ఇక మూడేళ్లు కాదు.. రెండేళ్లకే కుదించారు..
, బుధవారం, 8 జులై 2020 (10:51 IST)
మూడేళ్ల పాటు చదవాల్సిన మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఇకపై రెండేళ్లకే పరిమితం కానుంది. విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ శుభవార్తను వినిపించింది. తద్వారా ఎంసీఏ చదవాలనుకునే వారికి ఈ కోర్సు మరింత సులభతరం చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కేవలం రెండేళ్లలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆరు సెమిస్టర్లకు బదులు రెండు సంవత్సరాల్లో 4 సెమిస్టర్లు పూర్తి చేస్తేనే పట్టా ఇవ్వనున్నారు. ఎంసీఏ కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోర్సు వ్యవధి కుదింపునకు గతేడాదే ఆమోద ముద్ర లభించడంతో ఈ సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపిన యువతి.. కిడ్నాప్ చేసి అత్యాచారం.. ఎలా?