Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే ఏం జరుగుతుంది? పెంచుకునేందుకు ఏం చేయాలి?

రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే ఏం జరుగుతుంది? పెంచుకునేందుకు ఏం చేయాలి?
, శనివారం, 21 మార్చి 2020 (22:42 IST)
చాలామంది ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి జ్వరాలతో ఆసుపత్రులలో జాయిన్ అవడాన్ని చూస్తుంటాం. వారు కొంచెం ముందుజాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది రాదంటున్నారు వైద్య నిపుణులు. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను అభివృద్థి చేసే 9 ఉత్తమ ఆహారాలను తీసుకుంటే మంచిదంటున్నారు.
 
సాధారణంగా మన ఆహారంలో లక్షా 50 వేల నుంచి 4 లక్షల 50 వేల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఇవి మనకు ఏదైనా గాయం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా, గాయం తొందరగా తగ్గిపోయేలా పనిచేస్తాయి. ప్లేట్‌లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లను సమర్థవంతంగా చేస్తాయి.
 
ఒకవేళ ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణానికే ప్రమాదం. ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలోఎన్ని ప్లేట్‌లెట్స్ ఉన్నాయో తెలుస్తోంది. 
 
బీట్రూట్, క్యారెట్, బొప్పాయి, వెల్లుల్లి, ఆకుకూరలు, దానిమ్మ, యాప్లికాట్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం తినాలి. ఇవన్నీ నేచురల్‌గా ప్లేట్ లెట్స్ పెరగడానికి సహకరిస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు బీమా సౌకర్యం... ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే....