ఎండు ఖర్జూరాలు తింటే ఎంత మేలు జరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఎండు ఖర్జూర పండ్లను ఉదయాన్నే తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మూత్రాశయ సంబంధ సమస్యలన్నింటిని తొలగించుకోవాలంటే.. ఎండు ఖర్జూరాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
అజీర్తిని ఎండు ఖర్జూరాలు దూరం చేస్తాయి. గొంతు నొప్పి, మంట, జలుబు లాంటి సమస్యలు తొలగిపోతాయి. వీటిలో వుండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
విటమిన్ బి5 ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది. వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. బరువు తగ్గించేందుకు ఎండు ఖర్జూరాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. శిరోజాలు దృఢంగా మారేందుకు, జుట్టు వత్తుగా పెరిగేందుకు ఖర్జూరాలను డైట్‍లో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.