Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్ళ బాలికపై తొమ్మిది మంది గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (10:04 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 16 యేళ్ళ బాలికపై ఏకంగా తొమ్మిది మంది కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు... 
 
మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుల్లో ఇద్దరు వచ్చి బాలికను బైక్‌పై ఓ స్నేహితుడి గ్రామ సమీపంలోని నీటి కొలను వద్దకు తీసుకువెళ్లారు. కాసేపు అనంతరం తనను ఇంటి దగ్గర దిగబెట్టాల్సిందిగా మరో స్నేహితుడికి ఫోన్‌ చేసి అడిగింది. అతడు మరో యువకుడితో కలిసి బైక్‌పై యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. 
 
బైక్‌పై యువతిని ఎక్కించుకుని అటవీ మార్గం గుండా దగ్గరి దారి ఉందని చెప్పి బైక్‌ను దారి మళ్లించారు. అడవి లోపల మరో ఏడుగురు యువకులు ఉన్నారు. మిగిలిన ఎనిమిదిమంది తన స్నేహితుడితో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తన వాంగ్మూలంలో పేర్కొంది. 
 
యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిన అనంతరం యువకులంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆమె మెలకువలోకి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితులంతా పరారీలో ఉన్నట్లు వారిని అరెస్ట్‌ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వై.ఎస్‌. రమేష్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం