Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షల ఒత్తిడి.. బిల్డింగ్ ఎక్కి ఉరేసుకున్న విద్యార్థిని.. ఫెయిలయిపోతానని?

పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం హాస్టల్ బయట గోడకు వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థినులు షాక్ అయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (12:03 IST)
పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం హాస్టల్ బయట గోడకు వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థినులు షాక్ అయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి మార్వాడీ కాలేజీలో బి.ఏ.పార్ట్ టూలో ఇంగ్లీష్ హానర్స్ చదువుతూ ఉంది. ఆర్జీ స్ట్రీట్‌లో వినాయకమ్ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది. 
 
అయితే పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు రాసిన సూసైడ్ లేఖలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్ ను ఆమె స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఆ యువతి పరీక్షల ఒత్తిడి వలన ఎంతగానో ఇబ్బంది పడుతోంది. గతంలో ఫెయిల్ కూడా అయ్యిందని.. ఇంట్లో వారు తిట్టడం.. హాస్టల్‌లో వుంటూ చదువుతున్నా పరీక్షల్లో రాణించలేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ విషయాన్ని మృతురాలు ఆమె చెల్లెలితోనూ చెప్పిందంటున్నారు. ఆమె గదిలో ఆమెతో పాటు మరో ముగ్గురు ఉండడంతో గదిలో ఉరివేసుకోడానికి కుదరలేదు. దీంతో బిల్డింగ్ ఎక్కి.. అక్కడ ఉరివేసుకుంది. తనను క్షమించాలని తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments