Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మంటలు చెలరేగాయంటూ పుకార్లు : భయంతో కిందకు దూకిన ప్రయాణికులు.. ముగ్గురు మృతి!!

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (08:38 IST)
రైలులో మంటలు చెలరేగాయంటూ గుర్తు తెలియని వ్యక్తలుు పుకార్లు పుట్టించారు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వీరిలో కొందరు రైలు నుంచి దూకేశారు. అలాంటి వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుమన్‌డీహ్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రాంచీ - ససరామ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. 
 
ఇదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి వస్తున్న గూడ్సు రైలు వారిని ఢీకొట్టడంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆయన రైలును ఆపివేశాడు. ఆ వెంటనే భయంతో ముగ్గురు ప్రయాణికులు ఒకే ట్రాక్‌పై దూకడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన వెనుక ఏదైనా లక్ష్యంగా ఉందా లేదా నక్సల్స్ చర్యా అన్న కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments