Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బావిలో పడిన పెంపుడు పిల్లి.. రక్షించబోయి ఐదుగురి మృతి!!

deadbody

వరుణ్

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (13:47 IST)
మహారాష్ట్రలో ఘోర విషాదం జరిగింది. బావిలోపడిన పిల్లిని రక్షించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని అహ్మద్ నగర్‌లోని వాడ్కి గ్రామంలో జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మద్ నగర్‌లోని వాడ్కి గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ పిల్లి బావిలో పడింది. ఈ క్రమంలో ఆ పిల్లిని కాపాడేందుకు ఓ కుటుంబలోని ఒకరు బావిలోకి దిగారు. ఆ తర్వాత ఒకరినొకరు రక్షించుకునే సమయంలో ఆరుగురు బావిలోకి దూకేశారు. అయితే, నడుముకి తాడు కట్టుకిని దూకిన ఆరుగురులో చివరి వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదే విషయంపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పిల్లిని కాపాడే ప్రయత్నంలో బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్న బావిలో ఒకరి తర్వాత ఒకరు దూకిన ఆరుగురులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదుగురు మృతదేహాలను రెస్క్యూ బృందం స్వాధీనం చేసుకుంది. నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని పోలీసులు రక్షించారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నాురు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని పోలీసు అధికారి తెలిపారు. 
 
కాగా, మృతులను మాణిక్ కాలే (65), ఈయన కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబా సాహెబ్ గ్వైక్వాడ్ (36)లుగా గుర్తించారు. బయటకు తీసిన వ్యక్తిని మాణిక్ చిన్న కుమారుడు విజయ్‌గా గుర్తించారు. అయితే, ఓ ఆంగ్లపత్రిక కథనం మేరకు.. పూణె నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్ నగర్ జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెవాసా తాలూకాలోని వాడ్కి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఈ ఘటన జరిగిందని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి చాట్ సజెషన్ ఫీచర్.. పాత స్నేహితులతో మళ్లీ?