Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే చేతివాటం: కాలేజీ ప్రిన్సిపాల్‌కు చెంపదెబ్బ

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (14:21 IST)
Slap
కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ ఎమ్మెల్యే చేజేసుకోవడం కర్ణాటకలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
వివరాల్లోకి వెళ్తే నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను జూన్ 20న సందర్శించారు జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే  ఎం శ్రీనివాస్. అక్కడ కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై  ప్రిన్సిపాల్‌ నాగనాద్‌ను ఆరా తీశారు. 
 
ఎమ్మెల్యే  అడిగిన ప్రశ్నలకు, ప్రిన్సిపాల్‌ చెప్పిన సమాధానాలకు ఎక్కడ కూడా పొంతన లేకపోవడంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే కళాశాల సిబ్బంది ముందే ప్రిన్సిపాల్‌ చెంప పైన కొట్టాడు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో ఉద్యోగుల సంఘాలు జేడీఎస్ ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ విషయాన్ని జిల్లా కమీషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగుల సంఘం మండ్యా జిల్లా అధ్యక్షుడు శంభుగౌడ్ మంగళవారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments