Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తుల కోసమే అమృత ఇదంతా చేస్తుంది.. ఆ వీడియోలో అలా లేదే?

తమిళనాడు దివంగత సీఎం జె.జయలలిత తన జీవితం ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు సర్కారు తరపు న్యాయవాది మద్రాస్ హైకోర్టుకు వెల్లడించారు. తాను జయలలిత కుమార్తెనంటూ బెంగళూరుకు చెందిన అమృత కేసు వేసిన సంగతి తెలి

Webdunia
బుధవారం, 25 జులై 2018 (11:34 IST)
తమిళనాడు దివంగత సీఎం జె.జయలలిత తన జీవితం ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు సర్కారు తరపు న్యాయవాది మద్రాస్ హైకోర్టుకు వెల్లడించారు. తాను జయలలిత కుమార్తెనంటూ బెంగళూరుకు చెందిన అమృత కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సంబంధించి.. 1980 నాటి జయలలిత వీడియో క్లిప్‌లను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. 
 
జయలలిత ఆస్తులపై కన్నేసిన అమృత వాటిని సొంతం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పేర్కొన్నారు. జయలలితకు తాను 1980 ఆగస్టులో పుట్టినట్టు అమృత తన పిటిషన్‌లో పేర్కొంది. కానీ అదే ఏడాది జయలలిత ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను తమిళనాడు సర్కారు కోర్టుకు సమర్పించింది.
 
అమృత పుట్టినట్టు చెబుతున్న తేదీకి నెల రోజుల ముందే ఈ కార్యక్రమం జరిగిందని, ఈ వీడియోలో జయ గర్భంతో ఉన్న ఆనవాళ్లు లేవని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అదే విధంగా అమృత, జయలలిత కూతురని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అవసరం అనుకుంటే జయలలిత బంధువుల డీఎన్‌ఏతో అమృత డీఎన్ఏను పోల్చి చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments