Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణలో ఆ విషయం నాకు బాాగా నచ్చింది.. చెప్పిందెవరో తెలుసా? జయలలిత

డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్యం పాలై చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరుణ ఆరోగ్యంపై ప్రస్తుతం తమిళనాట పెద్ద చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే నేత కరుణలో నచ్చిన అంశ

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (15:36 IST)
డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్యం పాలై చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరుణ ఆరోగ్యంపై ప్రస్తుతం తమిళనాట పెద్ద చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే నేత కరుణలో నచ్చిన అంశాన్ని దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాట డీఎంకే-అన్నాడీఎంకే నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది కరుణలో ఓ విషయం తనకు నచ్చిందని దివంగత మాజీ సీఎం జయలలిత చెప్పారు. 
 
కరుణ గత నాలుగు రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతూ.. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలువురు నేతలు ఆస్పత్రిలో పరామర్శిస్తున్నారు. ఇంకా డీఎంకే కార్యకర్తలు కావేరీ ఆస్పత్రి వద్ద కరుణ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరుణకు రాజకీయ శత్రువుగా పిలువబడే జయలలిత ఆయన గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కరుణ లేని రాజకీయ రంగంలో తాను వుండనని.. తనకు ధీటైన రాజకీయ నేత ఆయనేనని చెప్పుకొచ్చారు. కరుణ లేని రాజకీయ రంగంలో తాను భాగం కాబోనని తేల్చిచెప్పారు. కరుణ కోసమే తనకు ఇష్టం లేని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టానని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

అలాగే కరుణలో నచ్చిన అంశం ఏంటంటే.. ఎంజీఆర్ 13 సంవత్సరాల పాటు రాజకీయాల్లో రాణిస్తున్న కాలంలో.. ఆ 13 సంవత్సరాలు.. డీఎంకే అధికారంలో లేకపోయినా.. ఆ పార్టీని కాపాడిన విధానం ఇష్టమని తెలిపారు. ఇంకా కరుణలో విలేకరులతో మాట్లాడేటప్పుడు అనూహ్యంగా విసిరే సెటైర్లు, టైమింగ్‌తో కూడిన సమాధానాలు ఇవ్వడం ఇష్టమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments