Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆరోగ్యంపై అభ్యంతరకర పోస్టులు... ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల అరెస్టు

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్య‌ ప‌రిస్థితిపై అభ్యంతరకర పోస్టులు చేసినందుకుగాను ఆ రాష్ట్ర పోలీసులు ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను అరెస్టు శారు. అవర్ సీఎం హెల్త్ ఈజ్ ఫైన్ అంటూ అన్నాడీఎంకే నేతలు విస్

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (13:41 IST)
త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్య‌ ప‌రిస్థితిపై అభ్యంతరకర పోస్టులు చేసినందుకుగాను ఆ రాష్ట్ర పోలీసులు ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను అరెస్టు శారు. అవర్ సీఎం హెల్త్ ఈజ్ ఫైన్ అంటూ అన్నాడీఎంకే నేతలు విస్తృతంగా వాట్సాప్, ట్విట్టర్ ప్రచారం చేపట్టినప్పటికీ... కొందరు అకతాయిలు మాత్రం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిరువురిని కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరులోని ఓ బ్యాంకుకు చెందిన ఉద్యోగులుగా పోలీసులు పేర్కొన్నారు. 
 
స్వయం సహాయక మహిళా బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పునిదాదేవి (37) అనే మహిళ ఇటీవల బ్యాంకుకు వెళ్లింది. అయితే, ఆ సమయంలో అందులో ఉద్యోగం చేస్తోన్న సురేష్‌, రమేష్‌లు జయలలితపై పలు వ్యాఖ్యలు చేశారు. 
 
దీంతో పునిదాదేవి ‘అమ్మ’కు ఏమయిందోనని ఆందోళన చెందింది. ఇంటికి వెళ్లిన త‌ర్వాత ఉద్యోగులు చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మేనా? అంటూ ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసింది. జయలలిత ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నార‌ని వారు చెప్పారు. 
 
ఆ మ‌రుస‌టి రోజు నుంచి బ్యాంకుకు సెలవులు రావడంతో పునిదాదేవి బ్యాంకుకు వెళ్లలేకపోయింది. అయితే, తాజాగా మళ్లీ బ్యాంకుకు వెళ్లిన పునిదాదేవి ఆ ఇద్దరు ఉద్యోగులను నిల‌దీసింది. వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 
 
బ్యాంకు ఉద్యోగులు స‌సేమిరా అనడంతో తొండాముత్తూర్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో వారిరువురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇదే అంశంపై అరెస్టు చేశారు.

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments