Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ మృతిపై అన్నీ పూర్తయ్యాయి.. బాధెందుకు..? శశికళపై కోపంతో అమ్మ ఆత్మ తిరుగుతుందా?

దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే కార్యకర్త పీ ఏ జోసెఫ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర,

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (16:58 IST)
దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే కార్యకర్త పీ ఏ జోసెఫ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 23లోపు వాటిని కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ప్రజలు జయలలిత మృతి పట్ల ఉన్న అనుమానాలు నివృత్తి కావాలని, ఆమె కాళ్లను తొలగించారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
 
ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన హెల్త్ బులిటెన్స్ మినహా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జయలలిత అనారోగ్య స్థితికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. అయితే ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. జయలలిత మృతికి సంబంధించి అన్నీ పూర్తయ్యాయని, ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. అమ్మకు చికిత్స అందించిన వివరాలను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించేందుకు అపోలో రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాట అమ్మ ఆత్మ తిరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. నెచ్చెలి శశికళపై కోపంతో అమ్మ ఆత్మ ఆస్పత్రి వద్ద.. సమాధి వద్ద తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అమ్మ అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగకపోవడంతో అమ్మ ఆత్మ శాంతించలేదని ఇప్పటికే ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
అలాగే రాజకీయాల్లోకి రానని.. అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని ప్రమాణం చేసిన శశికళ మాట తప్పడంతో జయమ్మ కోపం వచ్చిందని.. అందుకే ఆమె ఆత్మ తిరుగాడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అమ్మ ఆత్మను పోలిన ఫోటోలు మార్ఫింగ్ సౌజన్యమేనని మరికొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం