Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీ-ఫామ్ వేలిముద్రలకు నేనే సాక్షి : ప్రభుత్వ వైద్యుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం ఓ మిస్టరీ. అలాగే, ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తిరుప్పరకుండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థికి ఇచ్చిన బి-ఫామ్ పత్రంపై

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (09:53 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం ఓ మిస్టరీ. అలాగే, ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తిరుప్పరకుండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థికి ఇచ్చిన బి-ఫామ్ పత్రంపై జయలలిత సంతకం చేయకుండా వేలిముద్ర వేయడంపై ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఆ వేలిముద్రలు జయలలిత పెట్టినవి కావని, సంతకం చేయగలిగిన స్థితిలో ఉన్న ఆమె వేలిముద్రలు ఎందుకు పెట్టారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై డీఎంకే సభ్యుడు కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్టయితే సంతకం చేసే జయలలిత వేలిముద్రలు ఎందుకు వేశారంటూ ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది.
 
మరోవైపు, జయలలిత విచారణపై మృతిపై మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్వంలో ఏర్పాటైన విచారణ సంఘం ఎదుట హాజరైన ప్రభుత్వ వైద్యుడు బాలాజీ బీ-ఫాంలో ఉన్న వేలిముద్రలపై స్పష్టత ఇచ్చారు. బీ-ఫాంలపై వేలిముద్రలు వేయించడానికి అపోలో ఆసుపత్రిలో ఉన్న జయ వద్దకు తాను సాక్షిగా వెళ్లానని, ఆ సమయంలో జయలలిత వద్ద శశికళ మాత్రమే ఉన్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments