Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాముల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నంద్యాల జవాను వీరమరణం

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (08:59 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఇక్కడ ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ యువ జవాను వీరమరణం చెందారు. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరగ్గా, ఈ కాల్పుల్లో నంద్యాల జిల్లాకు చెందిన యువ జవాను వీరమరణం చెందాడు. 
 
జిల్లాలోని పాములపాడు మండలం మద్దూరు పంచాయతీకి చెందిన సురేంద్ర(24) 2019లో సైన్యంలో చేరారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందింది. 
 
మూడు రోజుల క్రితమే తమతో ఫోనులో మాట్లాడిన కుమారుడు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్య తల్లడిల్లిపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.
 
సెప్టెంబరు నెలలో ఇంటికి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సురేంద్ర పార్థివదేహం బుధవారం ఉదయానికి స్వగ్రామం చేరే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments