Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 మామిడి పండ్లను అమ్మి ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనింది.. ఎలా..?

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (16:42 IST)
మామిడి పండ్లను అమ్మి ఓ యువతి ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనుక్కుంది. ఆర్థిక స్థోమత లేని కారణంగా చదువును ఆపేసింది. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యక్తి మామిడి కాయలను కొనుగోలు చేయడం ద్వారా ఆమె చదువు కల నెరవేరింది... వివరాల్లోకి వెళ్తే.. జంషెడ్‌పూర్‌లోని ఓ రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న ఓ అమ్మాయి తులసిని స్థానిక ఛానల్ తో మాట్లాడుతూ… ఆన్‌లైన్‌ క్లాసులు వినాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి. కానీ, నా వద్ద అంత డబ్బులేదు. ఈ మామిడి పండ్లను అమ్మి, కుటుంబ అవసరాలకుపోగా మిగిలిన డబ్బును పొదుపు చూసుకుంటూ.. ఓ ఫోన్ కొనుక్కోవాలి అంటూ తనకు చదువుపై ఉన్న వాత్యల్యాన్ని చెప్పుకొచ్చింది.
 
అయితే ఇది చూసిన ఎడ్యుటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అమేయా హేటే.. ఆమె వద్దకు వచ్చి 12 మామిడి పండ్లను కొని, ఆమె తండ్రి అకౌంట్‌లోకి రూ.1,20,000లు పంపించాడు. అంటే ఒక్కో మామిడి పండును రూ. 10,000లు చెల్లించాడు. దీంతో ఆమె చదువు కష్టాలు తీరడమేకాక, కుటుంబం కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలిగింది. దీంతో అమేయా హేటేను ‘మామా’ అని ముద్దుగా పిలుస్తోంది ఆ చిన్నారి.
 
“అవును, నేను మామిడి పండ్లను అమ్మాను. ‘మామ’ అందించిన సహాయంతో ఆన్‌లైన్‌లో క్లాసులు వినేందుకు ఓ ఫోన్ కొనుగోలు చేశాను. క్లాసులకు హాజరవుతున్నాను” అని తులసి ఆనందంగా చెప్పుకొచ్చింది. 5వ తరగతి చదువుతున్న తులసి, కరోనాతో స్కూల్స్ మూసివేయం, ఆన్‌లైన్‌‌లో క్లాసులు ప్రారంభించడంతో.. ఫోన్ కొనే స్థోమత లేక చదువు మానేసింది. 
 
ఈ మేరకు హేటే మాట్లాడుతూ, కుటుంబాన్ని పోషించేందుకు తులసి చేస్తున్న పోరాటం గురించి విన్నాను. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలన్న ఆ చిన్నారి సంకల్పం ముందు నా సహాయం చాలా చిన్నది. ఆమె తన తలరాతను నింధించలేదు. భిక్ష కోరలేదు. అందుకే ఆమె వద్ద నుంచి మామిడి పండ్లను కొన్నామని, ఆమెను ప్రోత్సహించడం కోసమే చేశానని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments