ఇకపై వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్.. 160 బ్యాంకులతో మద్దతు

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (15:20 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వాట్సాప్‌ ఈ సదుపాయాన్ని గతేడాది అందుబాటులోకి తెచ్చింది.
 
కానీ చాలామందికి ఆ ఫీచర్‌ అందుబాటులోకి రాకపోవడంతో పాటు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఏడాది కాలంగా "వాట్సాప్‌ పే" ఫీచర్‌పై వర్క్‌ చేస్తుంది. తాజాగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు వాట్సాప్‌ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.
 
కాగా, ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ) సహకారంతో ఇండియాలోనే తొలిసారిగా 160 బ్యాంక్‌ల మద్దతుతో వాట్సాప్‌పే ఫీచర్‌ పనిచేస్తుంది.
 
వాట్సాప్‌ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ ఎలా చేయాలంటే
ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్‌ మెనూ ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి
ట్యాప్‌ చేసిన వెంటనే మనకు యాడ్‌ న్యూ పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది
ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే ... 160 బ్యాంక్‌ల లిస్ట్‌ చూపిస్తుంది
 
ఆ లిస్ట్‌ లో మీకు కావాల్సిన బ్యాంక్‌ నేమ్‌ పై క్లిక్‌ చేసి మీ ఫోన్‌ నెంబర్‌ ను వెరిఫై చేయాలి
వెరిఫై చేసే సమయంలో బ్యాంక్‌ కు లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌ కు మెసేజ్‌ వస్తుంది.
ఒక వేళ మీరు బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ యాడ్‌ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు.
 
బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ యాడ్‌ చేసి మీరు డబ్బుల్ని మీ వాట్సాప్‌ అకౌంట్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments