Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (09:44 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఒకటి వెలుగులోకి చూసింది. ఇందులో సాక్షాత్ ఒకరు డీఎస్పీ ఉండటం గమనార్హం. దీంతో ఈ కేసులో ఓ డీఎస్పీతో సహా 21 మందిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్‌తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 10-15 ఏళ్లలోపు వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు బుధవారం వెల్లడించారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని తెలిపారు. 
 
ఈటానగర్ బ్యూటీ పార్లర్‌ను నడుపుతున్న ఇద్దరు మహిళలు అస్సాంలోని ధేమాజీ నుంచి మైనర్లను అరుణాచల్ ప్రదేశ్‌కు తీసుకొచ్చారని ఎస్పీ రోహిత్ రాబ్బీర్ సింగ్ తెలిపారు. చింపూలో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే 4వ తేదీన వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు బాధిత మైనర్లను రక్షించారు. ఉద్యోగాల పేరిట ధేమాజీ నుంచి తీసుకొచ్చిన తర్వాత తమను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారని మైనర్లు వాపోయారు. 
 
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు సమాచారమిచ్చారు. విచారణలో మరో ఇద్దరు మైనర్లు కూడా మహిళల అధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. మరో బాలికను వేరే ప్రాంతానికి తరలించినట్లు గుర్తించారు. వీరందరినీ రక్షించి ప్రస్తుతానికి వసతి గృహానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వహణతో సంబంధం ఉన్న 10 మందిని, ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 11 మంది విటులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం