Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు కేజ్రీవాల్‌కు సంబంధం ఏంటి : ఈడీకి సుప్రీంకోర్టు ప్రశ్న

Advertiesment
arvind kejriwal

ఠాగూర్

, బుధవారం, 1 మే 2024 (08:08 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉన్న సంబంధం ఏమిటని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. పైగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారంటూ మరో ప్రశ్న సంధించింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారించారు. ఈ సంద్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జ్యూడీషియల్ ప్రొసీడింగ్స్ లేకుండానే మీరు క్రిమిలన్ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చా అని ప్రశ్నించారు. 
 
పైగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇంత వరకు ఒక్క అటాచ్‌మెంట్ చర్య కూడా తీసుకోలేదని, ఒకవేళ అటాచ్‌మెంట్ జరిగివుంటే కేసుతో కేజ్రీవాల్‌కు ఉన్న సంబంధం ఏంటో చూపెట్టాలని న్యాయమూర్తి కోరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ అడిగారు. ఇదిలావుంటే, ఈ కేసులో ఇంతవరకు కేజ్రీవాల్‌కు ఉన్న సంబంధాన్ని ఈడీ వెలికితీయలేకపోవడం గమనార్హం. కాగా, సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఈడీ ఈ నెల 3వ తేదీన సమాధానం ఇవ్వనుంది. 
 
షర్మిల - రేవంత్‌ రెడ్డిల రిమోట్ చంద్రబాబు వద్ద ఉంది : వైఎస్ జగన్ 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. షర్మిల, రేవంత్ రెడ్డిల రిమోట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల వద్దే ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే వారిద్దరూ నడుచుకుంటున్నారన్నారు. చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీతో ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందన్నారు. అలాగే, ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను ఎంపిక చేయడం వెనుక కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని తెలిపారు. 
 
ఆయన ఓ జాతీయ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ, కడప లోక్‌సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండటంపై తనకు ఎలాంటి బాధా లేదన్నారు. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనన్న బాధ మాత్రం ఉందన్నారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్ఆర్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల పని చేస్తుండటంపై ఆవేదనగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని సీఎం జగన్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరిలో రోజాను చూసి తప్పించుకుంటున్న వైసిపి నాయకులు, ఎందుకు?