Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో మరో ఘనత.. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసిందోచ్

Webdunia
గురువారం, 21 మే 2020 (12:06 IST)
ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై వుండే మాదిరి మట్టిని తయారుచేసి అబ్బురపరిచింది. ఈ ఆవిష్కరణకు గాను పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పెటెంట్‌ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి మరో ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది. 
 
ఈ మట్టి ఎందుకంటే.. భారత్ గతంలో తలపెట్టిన చంద్రయాన్‌లో విక్రమ్ మూన్ లాండర్.. చంద్రుడిపై దిగే సమయంలో విఫలమైంది. అయినా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ మరో ప్రయత్నం చేస్తోంది. అదే చంద్రయాన్-2. ఈ ప్రయోగాల్లో భాగంగా విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉంటే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది.
 
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు ఇది చాలా అవసరమౌతుంది. అయితే మొదట ఈ చంద్రమృత్తికను అమెరికా నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకున్నది కావడంతో.. దేశీయంగా చంద్రుని మీద వుండే మట్టిని తయారు చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments