Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (10:08 IST)
PSLV_49
షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. శ్రీహరికోటలో శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 51వ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ భారత్‌కు చెందిన ఈఓఎస్‌-01 సహా విదేశాలకు చెందిన తొమ్మిది విదేశి ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. 
 
దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ స మాచారం తెలుసుకోవచ్చు. కొవిడ్ -19 మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. కరోనాతో మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించిన విషయం తెలిసిందే. 
 
ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అలాగే జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments