Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో సంభోగం చేస్తూ యువతి మృతి.. కారణం అదేనట?

ప్రియుడితో సంభోగం చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయేల్ దేశానికి చెందిన ఇద్దరు ప్రేమికులు.. గత ఏడాది మార్చిలో ముంబైలోని కోలాబా ఏరియాకు చేరుకు

Webdunia
బుధవారం, 4 జులై 2018 (11:22 IST)
ప్రియుడితో సంభోగం చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయేల్ దేశానికి చెందిన ఇద్దరు ప్రేమికులు.. గత ఏడాది మార్చిలో ముంబైలోని కోలాబా ఏరియాకు చేరుకుని.. అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు.


టూరిస్ట్ వీసా మీద ముంబైకి వచ్చిన వారిద్దరూ.. ముంబై నగరాన్ని ఓ చుట్టు చుట్టేశారు. కానీ ఓ రోజు తన ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని యాకోవ్‌ హోటల్‌ సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. 
 
అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇటీవల పోలీసులకు అందడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయేల్ యువతి ఎలా చనిపోయిందనే విషయం తెలియవచ్చింది. 
 
ముంబైకి వచ్చిన ఇజ్రాయేల్ యువ జంట లైంగిక చర్యలో వుండగా.. ప్రియుడు యాకోవ్ ఆమె గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడ్డాడని.. దీంతో ఊపిరాడక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో తేలినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో ఏడాది అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం