Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈషా అంబానీ వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు... (Video)

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (11:06 IST)
దేశంలో నంబర్ వన్ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లి వచ్చే నెల 12వ తేదీన ముంబైలోని ఆయన నివాసంలో అంగరంగవైభవంగా జరుగనుంది. పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌తో ఈషా పెళ్లి జరుగనుంది. 
 
ఇందుకోసం ముకేశ్ అంబానీ ప్రత్యేకంగా తయారు చేయించిన పెళ్లి శుభలేఖ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారి, సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాక్సు రూపంలో, బంగారంతో తయారు చేసిన ఈ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ శుభలేఖ ధర అక్షరాల 3 లక్షల రూపాయలు. బాక్స్‌పైన వధూవరుల ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా 'ఐఎ' అని రాయించారు. 
 
పెళ్లి పత్రికను రెండంచెల పెట్టెల్లో అమర్చారు. మొదటి పెట్టె లోపల డైరీ రూపంలో వివాహ పత్రిక ఉంటుంది. బంగారు పూతతో డిజైన్ చేసిన ఈ డైరీని తెరవగానే గాయత్రి మంత్రం వినిపిస్తుంది. తర్వాతి పేజీలో శ్రీకృష్ణుడి ప్రతిమ ఓ వైపు ఈశా, ఆనంద్ రాసిన లేఖ ఓవైపు ఉంటుంది. 
 
నాలుగో పేజీలో 'శుభ్ అభినందన్' పేరుతో ఆహ్వాన పత్రిక, మిగిలిన పేజీల్లో వధూవరుల కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల పేర్లు, హిందూ దేవుళ్ల మంత్రాలను పొందు పరిచారు. 
 
ఇక రెండో బాక్సులో నాలుగు చిన్న ఆభరణాల పెట్టెలుంటాయి. ఆ పెట్టెల్లో బంగారు ప్రేములతో తయారు చేసిన హిందూ దేవతల ప్రతిమలతో పాటు చిన్న సంచుల్లో అత్యంత విలువైన రాళ్లతో తయారు చేయించిన నెక్లెస్‌లుంటాయి. ఈ బాక్స్ విలువే రూ.3 లక్షలు.
 
బాక్స్‌ను తెరిచిన వెంటనే అందమైన శుభలేఖ కనిపించి, ఆ తర్వాత గాయత్రీ మంత్రం వినిపించడం ఈ శుభలేక ప్రత్యేకత. వెడ్డింగ్ కార్డు ధర తెలుసుకుని అంతా విస్తుపోతున్నారు. అంబానీ కూతురు శుభలేఖ ఖర్చుతో పేదింట్లో 2-3 పెళ్లిళ్లు జరిగిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments