Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు అతిగా వాడితే ప్రమాదమా?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (06:41 IST)
కరోనా కారణంగా మాస్కు ధరించడం అందరికీ నిత్యకృత్యమైపోయింది. ముఖానికి మాస్కు లేనిదే బయటకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మాస్కులు అతిగా వాడటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి.

మాస్కులు వాడటం వల్ల కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయి పెరిగి, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలను అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ మియామీ ఖండించింది. అవి వట్టి అపోహలు మాత్రమే అని, మాస్కుల వినియోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించవని తేల్చి చెప్పింది.

మాస్కులు ధరించడం వల్ల ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఆక్సిజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయిల్లో మార్పు జరిగి అనారోగ్య పాలవుతారన్న వార్తల్లో నిజం లేదని, అయితే క్రానిక్‌ అబ్‌స్ట్రాక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సిఒపిడి)తో బాధపడేవారిలో ఈ సమస్య ఎదురుకావచ్చని పేర్కొంది.

సిఒపిడి సమస్య ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిపడతారని, అందువల్లే వారికి ఈ సమస్య ఎదురు కావొచ్చని అధ్యయనంలో పాల్గొన్న మైఖేల్‌ కాంపోస్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments