Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్: విజయ్ చందర్ ఘన నివాళులు

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (17:24 IST)
బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది  చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారని ఆయన అన్నారు. సినీ రంగానికి ఇర్ఫాన్ ఖాన్ చేసిన సేవలు మరువలేనివని విజయ్ చందర్ కొనియాడారు.

సినీ రంగానికి ఇర్ఫాన్ ఖాన్ లేని లోటు తీర్చలేనిదని విజయ్ చందర్ అన్నారు. ఇర్ఫాన్ ఖాన్  మొదటి సినిమా ‘సలామ్ బాంబే’ అయితే,  తెలుగులో కూడా మహేష్ బాబు హీరోగా ఉన్న  సైనికుడు సినిమాలో నటించారని , తెలుగు పరిశ్రమతో కూడా ఆయనకు అవినాభావ సంబంధం ఉందని ఎఫ్ డి సి చైర్మన్ తెలిపారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు విజయ్ చందర్  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
 
 
ఇర్ఫాన్ ఖాన్ మరణం సినీరంగానికి తీరని లోటు: తుమ్మా విజయకుమార్ రెడ్డి
బాలీవుడ్ విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్ మరణం చలన చిత్ర రంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఇర్పాన్ ఖాన్ 1988 లో సలాం బాంబే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనన్నలు అతిస్వల్పవ్యవధిలోనే పొందిన గొప్పనటునని ప్రశంసించారు.

తెలుగులో నిర్మించిన  సైనికుడు సినిమాలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల మనన్నలు పొందిన విలక్షణ నటుడని, ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమతో ఆయన అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారన్నారు.

ఎంతో విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్  మృతికి ఎఫ్.డి.సి. ఎం.డి. తుమ్మా విజయకుమార్ రెడ్డి ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ  సానుభూతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments