Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీతి ఆయోగ్ కార్యాలయం మూసివేత

నీతి ఆయోగ్ కార్యాలయం మూసివేత
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:42 IST)
నీతి ఆయోగ్ కార్యాలయం మూతబడింది. నీతి ఆయోగ్ లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించడంతో నీతి ఆయోగ్ కార్యాలయాన్ని వైరస్ రహిత ప్రాంతంగా చేసేందుకు రసాయనాలతో శుభ్రం చేసేందుకు తాత్కాలికంగా మూసివేశారు.

కరోనా విలయకాలంలో కేంద్ర రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు సూచనలిస్తోన్న ఆ కార్యాలయం ఇప్పుడు సడెన్ గా మూతపడింది. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ చర్చలు ఊపందుకున్న కీలక సమయంలో అక్కడి అధికారులు సిబ్బంది క్వారంటైన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లక్షణాలు బయటపడటానికి కొద్ది గంటల ముందు వరకూ కూడా కరోనా బాధితుడు ఆఫీసులో పని చేశారు. నీతి ఆయోగ్ చైర్మన్ ప్లానింగ్ శాఖకు బాధ్యుడైన ప్రధాని నరేంద్ర మోదీకి విషయాన్ని చేరవేసిన ఉన్నతాధికారులు.. బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రొటోకాల్స్ ప్రకారం నీతి ఆయోగ్ భవంతిని 48 గంటలపాటు మూసేసి క్రిమిసంహారక మందులు పిచికారి చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. వైరస్ సోకిన అధికారిని ఐసోలేషన్ కు తరలించగా బిల్డింగ్ లో పనిచేస్తోన్న మిగతావాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండి సంజయ్ బాధ్యతల స్వీకారం