Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ కు ఏడీబీ రూ.11,400 కోట్ల రుణం.. ఎందుకో తెలుసా?

భారత్ కు ఏడీబీ రూ.11,400 కోట్ల రుణం.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:14 IST)
కరోనా వైరస్​ కట్టడి కోసం భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఏడీబీ) రూ.11,400 కోట్ల లోన్ ఇచ్చింది.

వ్యాధి కంట్రోల్​(డిసీజ్​ కంటైన్​మెంట్)​, నివారణ (ప్రివెన్షన్)తోపాటు నిరుపేదలకు సామాజిక రక్షణ (సోషల్​ ప్రొటెక్షన్)​ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రుణాన్ని మంజూరు చేసింది.

గతంలో ఎప్పుడూలేనట్టుగా సవాల్​ ఎదుర్కొంటున్న ఇండియాకి సపోర్ట్​గా నిలబడటానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్​ మసత్సుగు అసకవా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఈ లోన్ అగ్రిమెంట్​పై ఎకనమిక్​ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ అడిషనల్​ సెక్రెటరీ సమీర్​ కుమార్​ ఖరే, ఏడీబీ కంట్రీ డైరెక్టర్​ కెనిచి యొకొయమా సంతకాలు చేసినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ చెప్పింది.

కరోనా యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​ (కేర్​) ప్రోగ్రామ్​లో భాగంగా ఏడీబీ ఈ సాయం చేసింది. పోయినవారం ఫిలిప్పీన్​కి కూడా ఏడీబీ ఇంతే మొత్తంలో లోన్​ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ జోన్‌లో దుకాణాలు తెరిచేందుకు అనుమతి: కర్ణాటక ప్రభుత్వం