Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో భార్యాభర్తల గొడవ.. జుట్టు పట్టుకున్నారు.. కానీ వారిని దించేశారు..

ఇంట్లోనే కాకుండా విమానంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. భర్త ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్‌ను.. నిద్రపోతున్న భర్త వేలిముద్రలత

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (12:16 IST)
ఇంట్లోనే కాకుండా విమానంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. భర్త ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్‌ను.. నిద్రపోతున్న భర్త వేలిముద్రలతో అతని ఫోన్ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించిన భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇరాన్‌కు చెందిన భార్యాభర్తలు చెన్నై నుంచి విమానంలో బాలీఖతార్ వెళ్తున్నారు. అప్పటికే భర్త తనను మోసగిస్తున్నాడన్న అనుమానంతో వున్న భార్య, అతడి ఫోన్‌ సమాచారం తెలుసుకోవాలని భావించింది. దీంతో నిద్రపోతున్న భర్త వేలిముద్రల సాయంతో అతని స్మార్ట్‌ ఫోన్‌ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఊహించని విధంగా అతనికి మెలకువ వచ్చేసింది. అంతే భార్యపై ఫైర్ అయ్యాడు. 
 
ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆమె కూడా అతనితో పోటీపడి వాగ్వాదం చేసింది. అంతే ఈ గొడవ ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దీంతో విమాన సిబ్బంది వారిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ దంపతులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని చెన్నైకి మళ్లించి, అక్కడ వారిద్దరినీ కిందికి దించేశారు. అనంతరం దంపతులిద్దరూ ఒక అవగాహనకు రావడంతో మరో విమానంలో వారిని  అధికారులు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments