Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాన్షు రాయ్ చనిపోయారా? ఎందుకు? ఏమిటి? ఎలా?

హిమాన్షు రాయ్ ఈ పేరు వింటే ముంబైలోని మాఫియా ఉలిక్కిపడుతుంది. ఉగ్రవాదులు వణికిపోతారు. మిస్టర్ రాయ్ అనే పేరు ముంబైలో మారుర్మోగుతుంటుంది. కేసు ఏదైనా సరే హిమాన్ష్ రాయ్ టేకప్ చేశారు అంటే చాలు అందులో ఎంత పె

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (18:01 IST)
హిమాన్షు రాయ్ ఈ పేరు వింటే ముంబైలోని మాఫియా ఉలిక్కిపడుతుంది. ఉగ్రవాదులు వణికిపోతారు. మిస్టర్ రాయ్ అనే పేరు ముంబైలో మార్మోగుతుంటుంది. కేసు ఏదైనా సరే హిమాన్ష్ రాయ్ టేకప్ చేశారు అంటే చాలు అందులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టడంతే. అందుకే పోలీసుల్లో సూపర్ పోలిస్‌గా ముంబై యుత్‌కు ఐకాన్ కూడా పేరు గడించారు హిమాన్షు రాయ్.


ఐపియల్ బెట్టింగ్ రాకెట్‌ను బద్దలు కొట్టి, దాని వెనుక జరుగుతున్న బాగోతాన్ని క్రికెట్ మాటున జరుగుతున్న మాఫియా లావాదేవీలు ప్రపంచానికి తెలియజేసింది కూడా హిమాన్షు రాయ్. ఆ తర్వాత లలిత్ మోడీ దేశం విడిచి వెళ్లారంటే రాయ్ సేకరించిన ఆధారాలు అలాంటివి. ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్‌గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబైపై దాడి చేసిన కసబ్‌కు ఉరిశిక్ష పడిందంటే పనిలో అతను చిత్తశుద్ధి అలాంటిది. 
 
మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపియల్ ఆఫీసర్ హిమాన్షు రాయ్ శుక్రవారం మే-11 ఆత్మహత్య చేసుకున్నారు. సౌత్ ముంబైలోని తన నివాసంలో మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాల సమయంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. ప్రస్తుతం హిమాన్షు రాయ్ మహారాష్ట్ర అడిషనల్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రక్తపు మడుగులో పడి ఉన్న హిమాన్షుని మెరీన్ లైన్స్‌లోని బాంబే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే హిమాన్షు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 1988 బ్యాచ్‌కు చెందిన రాయ్ హై ప్రొఫైల్ కేసులను డీల్ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. యంగ్ ఆఫీసర్‌గా 1995 నాసిక్ రూరల్ యస్‌పీగా విధులు నిర్వహించారు. ఏడాది కాలంగా రాయ్ మెడికల్ లీవ్‌లో ఉన్నారు.
 
ఐపియల్ బెట్టింగ్ స్కామ్ విచారణ టీమ్‌ను లీడ్ చేసి గుర్తింపు పొందారు రాయ్. ముంబై క్రైమ్ బ్రాంచ్ చీఫ్‌గా రాయ్ ఉన్న సమయంలోనే 26/11 ముంబై టెర్రర్ ఎటాక్ నిందితుడు పాకిస్ధాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడింది. డీజిల్ డాన్ మహ్మద్ అలీ షేక్‌ను అరెస్ట్ చేసి అందరి చేత ప్రశంసలందుకున్నాడు హిమాన్షు రాయ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suresh:నదియా బాయ్‌ఫ్రెండ్ నేను కాదు.. నాకు ఆమె సోదరి లాంటిది..

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments