Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొర‌టాల నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత టాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే ఇప్పుడు సినీ ప్రియులు అంద‌రూ ఠ‌క్కున చెప్పే పేరు కొర‌టాల శివ‌. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను... ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్టర్స్ అందిస్తోన్న కొర‌టాల నెక్ట్స్ మూవీ ఎవ‌రితో

Advertiesment
కొర‌టాల నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!
, శుక్రవారం, 4 మే 2018 (12:10 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత టాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే ఇప్పుడు సినీ ప్రియులు అంద‌రూ ఠ‌క్కున చెప్పే పేరు కొర‌టాల శివ‌. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను... ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్టర్స్ అందిస్తోన్న కొర‌టాల నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. బ‌న్నీతో అని కొంతమంది అంటుంటే... కాదు ప్ర‌భాస్‌తో అని మ‌రి కొంతమంది అంటున్నారు. 
 
ఈ క‌న్‌ఫ్యూజ‌న్ ఎందుకు అని కొర‌టాల‌నే అడిగితే... ఇంకా నెక్ట్స్ మూవీ గురించి ఆలోచించ‌డం లేదు. ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను స‌క్స‌స్ ఎంజాయ్ చేస్తున్నాను. క‌థ రెడీ అయిన త‌ర్వాత పూర్తి వివ‌రాలు తెలియ‌చేస్తాను అంటున్నారు.
 
ఇదిలా ఉంటే... ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... కొర‌టాల‌తో సినిమా నిర్మించేందుకు అల్లు అర‌వింద్, డా.కె.ఎల్.నారాయ‌ణ ప్లాన్ చేస్తున్నార‌ట‌. వీరిద్ద‌రు క‌లిసి ఈ సినిమాని నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే... ఇందులో బ‌న్నీ న‌టిస్తాడా..? లేక ప్ర‌భాస్ న‌టిస్తాడా..? అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ప్ర‌స్తుతం కొర‌టాల ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కు వెళ్లారు. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఈ హీరో ఎవ‌రు..? ఎప్పుడు ప్రారంభం..? అనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెహబూబా సెన్సార్‌ టాక్ విని ఛార్మి ఏం చేసింది..?