కొరటాల తదుపరి చిత్రం హీరో ఇతనే..!
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను... ఇలా వరుసగా బ్లాక్‌బస్టర్స్ అందిస్తూ ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు కొరటాల శివ. భరత్ అనే నేను ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేస్తూ సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంద
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను... ఇలా వరుసగా బ్లాక్‌బస్టర్స్ అందిస్తూ ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు కొరటాల శివ. భరత్ అనే నేను ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేస్తూ సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అమెరికాలో సైతం కొత్త రికార్డులు సృష్టిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే... జూన్ నుంచి మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
మరి..కొరటాల నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. కొరటాల శివతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. అయితే... కొరటాల మాత్రం తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. అయితే మీడియాలో మాత్రం రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. అది ఏంటంటే... తన తొలి చిత్ర హీరోతో మరోసారి కలిసి పనిచేసేందుకు కొరటాల రెడీ అవుతున్నారట.
అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరమీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. ప్రస్తుతం సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ తరువాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. బాలీవుడ్‌లోనూ త్వరలో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించేశాడు. ఈ సినిమాలన్ని పూర్తయితే గాని ప్రభాస్, కొరటాల కాంబినేషన్ తెర మీదకు వచ్చే అవకాశం లేదు. మరి... ప్రభాస్ రాధాకృష్ణతో సినిమా కన్నా ముందే కొరటాలతో చేస్తాడా..? లేక కొరటాల ప్రభాస్‌తో కంటే ముందు ఎవరితోనైనా సినిమా చేస్తారా అనేది తెలియాల్సివుంది.