Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో యువతి పీక కోశారు: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ వెళ్తుంటే.. సీసీటీవీ కెమెరాల్లేవా..!?

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన నగరంలో పెను సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది.

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (13:18 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన నగరంలో పెను సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి హత్యకు కారణమని పోలీసుల భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే స్వాతి (25) అనే ఓ యువతి  కార్యాలయానికి వెళ్లేందుకుగాను రైల్వే స్టేషన్‌కు శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో చేరుకుంది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను గుర్తుతెలియని దుండగులు కత్తితో పీక కోసి పారిపోయారు. 
 
చెంగల్పట్టులోని ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే స్వాతిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి పారిపోయారని.. ఈ విషయం తెలుసుకుని సంఘటనా ప్రాంతానికి పోలీసులు వచ్చేలోపే తీవ్ర రక్తస్రావమైన స్వాతి ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. స్వాతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. హత్యకు గురైన స్వాతి బ్యాగు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని.. చివరిగా స్వాతి తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. స్వాతితో చివరిగా మాట్లాడిన ప్రియుడి వద్ద  విచారణ జరుపుతున్నారు. స్వాతి హత్య నేపథ్యంలో రైల్వే స్టేషన్లో భద్రతను పెంచారు. మహిళా రక్షణ కోసం రైల్వే స్టేషన్ల భద్రత కరువైందని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా నుంగంబాక్కం రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడం ఈ హత్య చేసేందుకు దుండగులు అనుకూలంగా మారింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments