Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఫోటోలు నా దగ్గరున్నాయ్.. రూ.5 లక్షలిస్తావా? లేదా? ఫ్రెండ్‌కి కాబోయే భార్యకు బెదిరింపు!

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (13:13 IST)
స్నేహితుడికి కాబోయే భార్యను బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేయాలని భావించిన బడా పారిశ్రామికవేత్త కుమారుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైకు చెందిన వివేక్ అగర్వాల్. ఎంబీఏ చేస్తున్నాడు. బడా వ్యాపారవేత్త కుమారుడు. డబ్బుకూ, జల్సాలకు ఏమాత్రం కొదవలేదు. ఈయనకో స్నేహితుడు ఉన్నాడు. ఇతనికి ముంబైలోని ఓ బ్యాంకులో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న 23 యేళ్ళ యువతితో త్వరలో వివాహం కానుంది. 
 
దీంతో తనకు కాబోయే భార్యను వివేక్ అగర్వాల్‌కు ఆ స్నేహితుడు పరిచయం చేశాడు. ఇదే అదనుగా భావించిన వివేక్.. ఆమె మొబైల్‌ను దొంగిలించి అదులోని వ్యక్తిగత ఫోటోలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకున్నాడు. ఆ తర్వాత తనలోని వక్రబుద్ధిని బయపటపెట్టాడు. 
 
తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని లేదంటే ప్రైవేట్ ఫోటోలను బయటపెడతానని ఆ యువతిని బెదిరించసాడు. దీంతో ఏం చేయాలో తోచని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వారిచ్చిన సలహా మేరకు డబ్బులు ఇస్తాను కుర్లా స్టేషన్‌కు రమ్మని వివేక్‌కు చెప్పింది. 
 
తమ ప్లాన్ ప్రకారం అతడిని అక్కడే పట్టుకోడానికి పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అది పనిచేసి, అతడు దొరికేశాడు. ఈ ఫొటోలను ఆమె మొబైల్ ఫోన్ నుంచి తీసుకున్నానని, తనకు రూ.10-15 లక్షల వరకు అప్పులు ఉండటంతో ఇలా చేశానని అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments