Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్ అవుతుండగా భూమికి తగిలిన విమానం తోకభాగం.. తప్పిన పెనుముప్పు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (14:49 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోకభాగం నేలకు తగిలింది. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలెట్ల అప్రమత్తతో అది సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను నిలిపివేశారు. 
 
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 11న కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా.. తోక భాగం రన్‌వే నేలను తాకింది. అయితే, విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై డీజీసీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
"విమానం ల్యాండ్‌ అయ్యేంతవరకు ఏ సమస్యా తలెత్తలేదు. రన్‌వేను సమీపిస్తుండగా.. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అలాగే ల్యాండింగ్‌ ప్రక్రియను ఆరంభించారు. అయితే విమానం దిగే సమయంలో దాని తోకభాగం రన్‌వే నేలను తాకింది" అని డీజీసీఏ వెల్లడించింది.
 
ఈ ఘటన కారణంగా విమానం వెనుకభాగం దెబ్బతింది. దీంతో దాని సేవలను నిలిపివేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అప్పటిదాకా విమానం నడిపిన పైలట్లను కూడా విధుల నుంచి పక్కనబెట్టినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments