Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న బిపర్జాయ్ తుఫాను... ఎనిమిది రాష్ట్రాలకు అలెర్ట్

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (13:26 IST)
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను ముంచుకొస్తుంది. ఈ తుఫాను కారణంగా ఎనిమిద రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ తుఫాను గురువారం సాయంత్రం గుజరాత్ రాష్ట్రంలోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే, తీరం దాటే సమయంలో అపార నష్టాన్ని కలిగించవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తీర ప్రాంత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అటు గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 
 
కచ్‌, ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ, జునాగఢ్‌, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యం లేదని పేర్కొంది. 
 
ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 38 వేల మందిని మరో చోటుకు తరలించారు. తుఫాను ప్రభావంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. 
 
బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతో పాటు డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్‌లో జూన్‌ 16 నుంచి ఈ తుఫాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments