Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్ సభ ఎన్నికలు 2019, అమెరికాను మించిపోతున్న భారత్... ఏ విషయంలో?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (16:41 IST)
భారతదేశంలో ఎన్నికలు జరిగే సమయంలో డబ్బు ప్రవాహంలా ఉంటుందనే విషయం బహిరంగ సత్యం. అభ్యర్థులు ప్రకటించే ఖర్చులకు చేసే ఖర్చులకు పొంతనే ఉండదు. అయితే ఈ సారి జరగబోయే ఎన్నికల్లో చేయబోయే వ్యయం సరికొత్త ప్రపంచ రికార్డును సాధిస్తుందట. భారతదేశంలో ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఆరు వారాల వ్యవధిలో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
 
ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలు (7 బిలియన్ డాలర్లు) ఖర్చు కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకటించింది. అయితే ఈ మొత్తం 2014 ఎన్నికల ఖర్చు కంటే 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు సిఎమ్ఎస్ పేర్కొన్నది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 6.5 బిలియన్ డాలర్లు ఖర్చు కాగా, భారతదేశంలో 2019 ఎన్నికల ఖర్చు దాని కంటే 50 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండబోతోందని పేర్కొన్నది.
 
అదేవిధంగా ఇండియాలో 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ఖర్చు రూ. 250 కోట్లుగా ఉండగా ఈ ఎన్నికల్లో దాదాపు 5 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పార్టీలు పెట్టే ఖర్చులో అత్యధిక భాగం ప్రకటనలు, ప్రయాణ ఖర్చులు, సోషల్ మీడియా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments