Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు!!

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (11:27 IST)
దేశ వ్యాప్తంగా తల్లిపాల విక్రయంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీచేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్ట ప్రకారం దేశంలో తల్లిపాలను విక్రయించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 
 
నిజానికి శిశువులకు తల్లిపాలు ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. అయితే, కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వమే పాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలను అందిస్తోంది. అయితే, తల్లి పాలను విక్రయించడం చట్ట వ్యతిరేకమని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్-2006 యాక్ట్ ప్రకారం తల్లి పాల విక్రయానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
 
పాలిచ్చే తల్లుల నుంచి ప్రభుత్వమే పాలను సేకరించి, అవసరంలో ఉన్న చిన్నారులకు అందిస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఆ మేరకు ప్రభుత్వం పాల బ్యాంకులు ఏర్పాటు చేసిందని వివరించింది. అయితే, కొందరు వ్యాపార దృక్పథంతో తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో ఇలాంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని ఇలాంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు, తల్లిపాల విక్రయానికి ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments