Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్ అంటే తెలియదు.. పిజ్జాలు.. బర్గర్లంటే తెలుసు.. ఇదీ నేటి యువత జనరల్ నాలెడ్జ్ (వీడియో)

నిజంగా కొంతమంది యువత చేస్తున్న వ్యాఖ్యలు దేశ ఆర్మీని కించపరిచేలా ఉన్నాయి. అత్యంత ధైర్యసాహాలతో.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువులతో భారత సైన్యం నిరంతరం పోరాడుతోంది.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (16:14 IST)
నిజంగా కొంతమంది యువత చేస్తున్న వ్యాఖ్యలు దేశ ఆర్మీని కించపరిచేలా ఉన్నాయి. అత్యంత ధైర్యసాహాలతో.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువులతో భారత సైన్యం నిరంతరం పోరాడుతోంది. కానీ, యువత మాత్రం.. వారి ధైర్యసాహసాలను ప్రశంసిక పోయినా ఫర్వాలేదు గానీ, వారు చేసే యుద్ధ సాహసాలను కించపరిచేలా మాట్లాడకుండా ఉంటే చాలు. దీనికి నిదర్శనమే సర్జికల్ దాడులపై పలువురు యువత చేసిన వ్యాఖ్యలు. 
 
సర్జికల్ స్ట్రైక్స్. దేశ సైనికులు అత్యంత సాహసంతో చేసిన లక్ష్యిత దాడులు. యురీ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్‌తో ధీటుగా బదులిచ్చారు. ఈ అంశం అనేక అవకాశవాద రాజకీయాలకు వేదికగా కూడా మారింది. అయితే ఇంత జరుగుతున్నా సర్జికల్ స్ట్రైక్స్ అనే పదానికి అర్థం తెలియని యువత ఉందంటే నమ్ముతారా.? కానీ ఇక్కడ నమ్మితీరాల్సిందే. 
 
ఎందుకంటే మన దేశానికి చెందిన కొందరు యువత అంత గొప్పగా కరెంట్ ఎఫైర్స్‌ (జనరల్ నాలెడ్జ్)ను ఫాలో అవుతున్నారు మరి. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సర్జికల్ స్ట్రైక్స్ అంటే తమకు తెలియదని, బర్గర్లు, పిజ్జాలు అంటే మాత్రం తమకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇలా చెప్పినవారు నిరక్షరాస్యులయితే ఏమోలే అనుకోవచ్చు కానీ విద్యావంతులు, ఉద్యోగులకు కూడా తెలియదంటే ఇంకేమనాలి. సైనికులు మన కోసం అత్యంత ధైర్య సాహసాలతో చేసిన ఈ సర్జికల్ దాడుల గురించి తెలియని వారు ఎంత మంది ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

Vijay Deverakonda: నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను.. విజయ్ దేవరకొండ

Siddu: బ్యాడాస్ లో చుట్టూ కెమెరాలు మధ్యలో సిగార్ తో సిద్ధు జొన్నలగడ్డ లుక్

Samantha: రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించిన సమంత.. ఫోటోలు షేర్ చేసింది.. కన్ఫామ్ చేసిందా?

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments