Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నాం.. మాటిచ్చా... నిలబెట్టుకున్నా: మోడీ

సరిహద్దుల్లో రేయింబవుళ్లు కాపలా కాస్తున్న సైన్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చెప్పారు. దీపావళి సంబరాలను ఆయన సైనికులతో కలిసి జరుపుకున

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:54 IST)
సరిహద్దుల్లో రేయింబవుళ్లు కాపలా కాస్తున్న సైన్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చెప్పారు. దీపావళి సంబరాలను ఆయన సైనికులతో కలిసి జరుపుకున్నారు. 
 
ఇందులోభాగంగా హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా సుమ్‌డౌలో ఐటీబీపీ, భారత ఆర్మీ జవాన్లను, డోగ్రా స్కౌట్స్‌ను కలుసుకున్నారు. సైనికులకు స్వీట్లు తినిపించారు. జవాన్లు కూడా ప్రధానికి స్వీట్లు తినిపించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైన్యం వల్లనే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పారు. దేశం అంతా సైన్యం వెంటే ఉందని, దీపావళి సందర్భంగా దేశ ప్రజలంతా సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగిస్తున్నారని మోడీ చెప్పారు.
 
ఇకపోతే.. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై సైనికులకు మాటిచ్చి నిలబెట్టుకున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు 500 కోట్ల రూపాయలుగా అంచనా వేశాయని, తాను రంగంలోకి దిగాక 10 వేల కోట్ల రూపాయలని తేలినా వెనుకంజ వేయలేదని చెప్పారు. సైనికుల కోసం ఏమైనా చేయాలనుకున్న తన ఆకాంక్ష నెరవేర్చానని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments