Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పరుగులు తీయనున్న వందే భారత్ మెట్రో

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (12:40 IST)
దేశంలో వందే భారత్ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా సేవల కోసం ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ యేడాది జూలై నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సన్నాహాలు. తొలుత 12 కోచ్‌‍లతో మెట్రో రైళ్లు పరుగులు డిమాండ్ పెరిగితే 16 కోచ్‌లకు పెంచాలని యోచిస్తుంది. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ యేడాది జైలు నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలిపారు. 
 
వేగంగా వెళ్లగలగడంతోపాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాఫ్‌లలో ఆగేందుకు వీలవుతుంది. నగర ప్రజల అవరాలను దృష్టిలో పెట్టుకుని వందే మెట్రోలలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. 
 
ఈ యేడాది ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రెండు నెలల తర్వాత ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్ళలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలను అతి త్వరలో ప్రజలతో పంచుకుంటాం అని ఆయన తెలిపారు. అలాగే, ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకునిరావాలనే విషయాన్ని కూడా పరిశీలించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments