Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే శాఖలో ఉద్యోగాలు : 9,144 రైల్వే టెక్నీషియన్ ఉద్యోగ పోస్టులు

Advertiesment
indian railway

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (15:13 IST)
రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాలను భర్తీ చేయనన్నారు. దాదాపు 5 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇటీవల దాదాపు 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,144 రైల్వే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్డీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 9 నుంచి 18 వరకు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు.
 
తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే, మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 1092 పోస్టులు కాగా.. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052. వయో పరిమితి: జులై 1,2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు. గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్/దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు.
 
దరఖాస్తు రుసుం రూ.500. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత రూ.400 రిఫండ్ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్/మహిళలు/థర్డ్ జెండర్/మైనార్టీలు/ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
 
ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టులకు ఏడో సీపీసీలో లెవెల్ -5 కింద ప్రారంభ వేతనంగా రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులకు లెవెల్ -2 కింద 19,990 చొప్పున చెల్లిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూడముచ్చటగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు : సింగిల్ బెడ్రూం - అటాచ్డ్ వాష్‌రూం.. కిచెన్...