Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్‌ వీడియోలను తొలగించండి.. యూట్యూబ్‌కు ఆదేశం

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:15 IST)
పాకిస్థాన్‌కు పట్టుబడిన మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు సంబంధించి ఇప్పటి వరకు బయటికి వచ్చిన వీడియోలను వెంటనే తొలగించమని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యూట్యూబ్‌ను ఆదేశించింది. తక్షణమే ఈ తొలగింపులు చేపట్టాలని కూడా కేంద్ర ఐటీ శాఖ యూట్యూబ్‌ను ఆదేశించింది. 
 
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు కేంద్ర ఐటీ శాఖ అభినందన్‌కు చెందిన దాదాపు 11 వీడియోలకు చెందిన లింక్‌లను తక్షణమే యూట్యూబ్ నుంచి తొలగించమని యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు యూట్యూబ్‌లో ఉన్న అభినందన్ వీడియోలను తొలగించే పనిని ఇప్పటికే ప్రారంభించినట్లు యూట్యూబ్ యాజమాన్యం పేర్కొంది. 
 
ఈ వీడియోలు మరింత ఎక్కువగా వైరల్ కావడం వల్ల భద్రతా సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments