Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం స్వదేశానికి అభినందన్.. శాంతిని కోరుకుంటున్నాం.. అందుకే?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:56 IST)
ప్రాణాలకు తెగించి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని తరిమికొట్టే క్రమంలో నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌కు చిక్కిన మన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ విషయంగా భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.


ఏది ఏమైనా తమ కమాండర్‌ను సురక్షితంగా అప్పగించాలని ఈ విషయంలో ఎటువంటి డీల్‌లకు కానీ ప్రలోభాలకు కానీ తలొగ్గేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
 
ఈ నేపథ్యంలో తమకు బంధీగా చిక్కిన భారత కమాండర్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయబోతున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని ఇందుకు సూచనగానే అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ చర్యను భారత్ పాక్‌ల మధ్య చర్చలకు మొదటి అడుగుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
 
పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్ డిప్యూటీ హైకమీషనర్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు తనకు అందాయని, ఈ నేపథ్యంలో తాను నరేంద్ర మోదీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అభినందన్‌ను శుక్రవారం సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments