Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కోల్పోయి పక్షం రోజులు.. మరిదిని పెళ్లాడాలని వీర జవాను భార్యకు వేధింపులు

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:44 IST)
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవాన్ భార్య. చెప్పుకోవడానికి సగర్వంగా ఉన్నా, ఆమె దీనగాథ వింటే మనకు మనసు చలించిపోతుంది. కొద్ది రోజుల క్రితమే భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమెకు అత్తారింటి వేధింపులు తప్పలేదు. ఈ విషయంలో అమరవీరుల కుటుంబానికి కూడా మినహాయింపు లేదనిపిస్తోంది. డబ్బులు కోసం మరిదిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
రాష్ట్రంలోని మాండ్వా ప్రాంతానికి చెందిన హెచ్ గురు పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పక్షం రోజులు కూడా గడవక ముందే అతని భార్య కళావతిపై అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రయోజనాలు ఎక్కడ దక్కకుండా పోతాయో అనే దురుద్దేశంతో మరిది వరుసయ్యే భర్త తమ్ముడికి ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు. 
 
అయితే చనిపోయిన వీర జవానుకు భార్యగా ఆమె చేసిన సెల్యూట్ చూసి యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఆమె కుటుంబానికి నటి సుమలత అర ఎకరం బహుమానంగా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీర జవాన్ల కుటుంబాలకు అనేక ఆర్థిక సహాయాలు అందించాయి. ఈ నేపథ్యంలో 15 రోజులు కూడా గడవక ముందే వారు ఈ ఘాతుక చర్యకు పాల్పడ్డారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో మాండ్వా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments