Webdunia - Bharat's app for daily news and videos

Install App

40మందితో రాసలీలలు.. భార్య భర్తను పక్కాగా అరెస్ట్ చేయించింది.. కోర్టు మెట్లెక్కి?

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:43 IST)
40మందితో రాసలీలలు.. ఆ కామాంధుడిని భార్యే పక్కా ప్లాన్‌తో భర్తను పోలీసులకు పట్టించింది. తమిళనాడు తిరుచురాపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసే జయకుమార్ అనే వ్యక్తి బుద్ధి వంకర. 
 
బాధ్యతాయుతమైన ఉద్యోగం అయినప్పటికీ.. రుణాల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని వారిపై తన కామవాంఛను తీర్చుకునేవాడు. రుణాల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని.. వారితో గడిపిన రాసలీలల వీడియోలతో బెదిరింపులకు పాల్పడేవాడు. ఇతని ఆగడాలను గమనించిన భార్య, వీడియో ఆధారాలు సహా బట్టబయలు చేయగా, తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో జయకుమార్ సహా, అతని కుటుంబీకులంతా పరారీలో ఉన్నారు. 
 
గత సంవత్సరం డిసెంబర్ 2న తంజావూరు జిల్లాకు చెందిన యువతి జయకుమార్‌కు వివాహం అయ్యింది. కాపురానికి వెళ్లిన ఆమెకు చేదు అనుభవాలే మిగిలాయి. తన ఇంట్లోని ప్రత్యేక గదిలో మహిళలతో గంటల తరబడి గడుపుతూ ఉన్నాడని, తనతో సఖ్యతగా లేడని గమనించింది. ఆ గదిలోకి వెళ్ళి చూడగా, అక్కడ నమ్మలేని విషయాలు ఆమెకు బోధపడ్డాయి. 
 
15 సెల్ ఫోన్లు, వాటిల్లో బ్యాంకు ఖాతాదారులమని చెప్పుకుని వచ్చే మహిళలతో సన్నిహితంగా ఉన్న చిత్రాలు, బాత్ రూమ్ వీడియోలు లభించాయి. అతని ఆగడాలను కట్టించాలని భావించి, సాక్ష్యాలను సేకరించింది. జరిగిన విషయాన్ని పుట్టింటికి, అత్తారింటికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇంకా భార్య స్నానం చేస్తుండగా, వీడియో తీశామని, విషయాన్ని బయటకు చెబితే, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని భర్తే బెదిరించాడు. 
 
ఈ క్రమంలో భర్త నుంచి తప్పించుకున్న భార్య, డీజీపీని కలిసి తన గోడు వెళ్లబోసుకోవడంతో, ఆయన ఆదేశాల మేరకు జయకుమార్, అతని తల్లి, సోదరి, బంధువు, దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగినిలపై కేసు నమోదైంది. ఆ వెంటనే తన పరపతిని ఉపయోగించి, మధురై హైకోర్టు బెంచ్ నుంచి జయకుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. 
 
దీంతో అతన్ని అరెస్ట్ చేయలేమని పోలీసులు స్పష్టం చేయగా, భార్య, తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకెళ్లి, మధురై కోర్టు ముందుంచింది. వాటిని పరిశీలించిన న్యాయమూర్తులు, జామీనుపై విడుదల చేసేందుకు వీల్లేని సెక్షన్లు పెట్టి, తక్షణం నిందితులను అరెస్ట్ చేయాలని సూచించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments