Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్నారు. అలాంటి జవాన్లు ఉగ్రమూకల తూటాలకు బలవుతున్నారు. అయినప్పటికీ చివరి నిమిషం వరకు ప్రాణాలు ఫణంగా పెట్టి దే

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (12:15 IST)
భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్నారు. అలాంటి జవాన్లు ఉగ్రమూకల తూటాలకు బలవుతున్నారు. అయినప్పటికీ చివరి నిమిషం వరకు ప్రాణాలు ఫణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. తాజాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్మీ అధికారి చేసిన ఫోన్ వివరాలు ప్రతి ఒక్కరి గుండెలు పిండేస్తున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుబేదార్ కుమార్ ఉత్తర కాశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన భార్య దేవి సొంతూరులో ఉంటుంది. కాగా, ఆదివారం కర్వాచౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవి ఉపవాసంతో పూజలు చేసింది. 
 
మరోవైపు ఆదివారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో శత్రువు తూటాకి తీవ్రంగా గాయపడిన కుమార్ తన భార్యకు ఫోన్ చేసి... 'నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను' అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. 
 
ఉగ్రవాదుల కాల్పుల్లో కుమార్ మృతి చెందినట్టు ఉన్నతాధికారులు సోమవారం ఉందయం ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మాటలు విన్న దేవి కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చి తేరుకునేలా చేశారు. 
 
కాగా, వీర సుబేదారు కుమార్‌ భౌతికకాయానికి మంగళవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments