Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనకం పట్టినట్టు ఊగిపోయిన విమానం.. ఎందుకు (Video)

సాధారణంగా విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తంత భయభ్రాంతులకు గురిచేస్తాయి. అదే తుఫానులు, హరికేన్‌లు, భీకర గాలుల్లో చిక్కుకునే విమానాలు ల్యాండ్ కావడం అనేది ఓ సాహయంతో కూడుకున్న పనే.

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (11:51 IST)
సాధారణంగా విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తంత భయభ్రాంతులకు గురిచేస్తాయి. అదే తుఫానులు, హరికేన్‌లు, భీకర గాలుల్లో చిక్కుకునే విమానాలు ల్యాండ్ కావడం అనేది ఓ సాహయంతో కూడుకున్న పనే.
 
తాజాగా, ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరొందిన ఎమిరేట్స్ విమాన సంస్థకు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానం ల్యాండ్ అవుతూ పూనకం పట్టినట్టు ఊగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బెంబేలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జర్మనీలోని డ్యూసెల్‌ డార్ఫ్‌ ఎయిర్ పోర్టులో ల్యాండ్‌ అవుతున్న సమయంలో భీకరమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో గాల్లో ఉన్నంతసేపు స్థిరంగా ఉన్న విమానం రన్ వేపై ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి అటూఇటూ ఊగిపోయింది. 
 
ఒక సందర్భంలో అయితే రన్‌వేను తాకి మళ్లీ గాల్లోకి లేచింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. అయితే ల్యాండ్ అయిన కాసేపటి వరకు విమానం ఊగిపోతూనే ఉండడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే కోటి మందికి పైగా నెటిజన్లు చూడటం గమనార్హం. ఈ వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments